తెలంగాణ

telangana

By

Published : Oct 16, 2019, 5:59 AM IST

Updated : Oct 16, 2019, 1:40 PM IST

ETV Bharat / bharat

'సరిహద్దు సవాళ్ల పరిష్కారంలో సైన్యం భేష్​'

పశ్చిమ, తూర్పు సరిహద్దు సవాళ్లపై స్పందించారు భారత సైన్యాధిపతి​ జనరల్​ బిపిన్​ రావత్​. కశ్మీర్​లోని ఉగ్రవాదులు, బోర్డర్​ యాక్షన్​ టీం చర్యల గురించి మాట్లాడారు. ఆర్మీ కమాండర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. విపత్కర పరిస్థితులను సైన్యం.. వినూత్న పద్ధతిలో ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు.

సరిహద్దు సవాళ్ల అంశంలో సైన్యంపై రావత్​ ప్రశంసలు

'సరిహద్దు సవాళ్ల పరిష్కారంలో సైన్యం భేష్​'

భారత సైన్యాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ పశ్చిమ, తూర్పు సరిహద్దు వివాదాలపై స్పందించారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​కు చెందిన బోర్డర్ యాక్షన్​ టీం (బీఏటీ), జమ్ముకశ్మీర్​లోని ఉగ్రవాద చర్యల గురించి ప్రస్తావించారు. సైన్యం.. చాలా వినూత్నంగా ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటునట్లు స్పష్టం చేశారు.

దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత భద్రతాపరమైన సమస్యలపై ఈ నెల 14 నుంచి 19 వరకు ఆర్మీ కమాండర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. జమ్ముకశ్మీర్​ సహా ఇతరత్రా అంశాల భద్రతపై తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యల గురించి ఇందులో చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రావత్​... పశ్చిమ, తూర్పు సరిహద్దు సవాళ్ల విషయంలో సైన్యం పోరాటాలను కొనియాడారు.

నియంత్రణ రేఖ వద్ద సైనికులు వినూత్న పద్దతిలో ఆపరేషన్ నిర్వహించి విజయం సాధించటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని బిపిన్​ రావత్​ తెలిపారు. అంతేకాకుండా సైనికులు బాధ్యతగా వ్యవహరించటం వల్ల నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రచర్యలను నిలువరించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కఠినమైన, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పని చేస్తున్న సైనికుల సమస్యలను పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.

దేశ భద్రతకు సంబంధించిన అన్ని విషయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) ఎంతో సహకరిస్తుందని తెలిపారు. ప్రతి ఏడాదీ ఏప్రిల్​, అక్టోబర్​లో ఆర్మీ కమాండర్ల సమావేశం జరుగుతుంటుంది.

ఇదీ చూడండి:ఆర్టెమిస్ మిషన్​: నాసా 'నెక్ట్స్​​ జనరేషన్​ స్పేస్​సూట్లు'

Last Updated : Oct 16, 2019, 1:40 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details