తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ ఛానల్​ రేటింగ్​ పెంచేందుకు కుట్ర!'

టీఆర్​పీ అవకతవకల విషయంలో రిపబ్లిక్​ టీవీ ఛానల్​ చీఫ్​ ఎడిటర్​ అర్ణబ్​ గోస్వామి, బార్క్​ మాజీ సీఈఓ పార్థా దాస్​ గుప్తాల మధ్య జరిగిన వాట్సాప్​ సంభాషణపై ఆందోళన వ్యక్తం చేసింది ఎన్​బీఏ. ఇతర ఛానళ్ల రేటింగ్​లను తగ్గించి.. రిపబ్లిక్​ టీవీకి వీక్షకులను పెంచుకునేందుకు వీరు ప్రయత్నించినట్టు వెల్లడైందని తెలిపింది.

By

Published : Jan 18, 2021, 7:22 PM IST

Updated : Jan 18, 2021, 8:08 PM IST

Ratings must remain suspended till BARC takes action to address concerns: NBA
'ఆ చాటింగ్​తో రిపబ్లిక్​ ఛానల్​కు వీక్షకులను పెంచుకునేందుకు కుట్ర'

రిపబ్లిక్‌ ఛానల్‌ చీఫ్‌ ఎడిటర్‌ అర్ణబ్‌ గోస్వామి, బార్క్‌ మాజీ సీఈఓ పార్థో దాస్‌ గుప్తా మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌పై నేషనల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అసోసియేషన్(ఎన్​బీఏ) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇతర ఛానళ్ల రేటింగ్‌లను మోసపూరితంగా తగ్గించి.. రిపబ్లిక్‌ ఛానల్‌కు నెలవారీగా వీక్షకులను పెంచేందుకు వీరిద్దరూ కుట్ర పన్నినట్లు ఈ సంభాషణలో స్పష్టంగా వెల్లడైందని తెలిపింది ఎన్​బీఏ.

ఈ వాట్సాప్‌ సందేశాలు కేవలం టీఆర్‌పీ తారుమారునే కాకుండా.. అధికార బలాన్ని తెలుపుతున్నాయని పేర్కొంది. ఈ సంభాషణ గత నాలుగేళ్లుగా టీఆర్పీ అవకతవకలపై తాము చేస్తున్న ఆరోపణలను ధ్రువీకరిస్తోందని ఎన్‌బీఏ వ్యాఖ్యానించింది. భారత బ్రాడ్‌కాస్టింగ్‌ ఫౌండేషన్(ఐబీఎఫ్​)లో రిపబ్లిక్‌ టీవీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్​బీఏ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బార్క్‌ ముందు పలు డిమాండ్లను ఉంచిన ఎన్​బీఏ తప్పుడు రేటింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. తీసుకున్న చర్యలను తమతో పంచుకునేంత వరకు ఛానళ్ల రేటింగ్‌లను నిలుపుదల చేయాలని బార్క్‌కు.. ఎన్​బీఏ విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి:వాట్సాప్ బదులు వేరే యాప్ వాడండి: హైకోర్టు

Last Updated : Jan 18, 2021, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details