మహారాష్ట్రలో ఘోరం జరిగింది. పాల్ఘర్ జిల్లా వసాయ్విరార్లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, సంచిలో చుట్టి పడేసిన ఘటన కలకలం సృష్టించింది. కొన ఊపిరితో ఉన్న చిన్నారిని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం - మహారాష్ట్ర పాల్ఘర్లో చిన్నారిపై అత్యాచారం
తోటి చిన్నారులతో కలసి ఆడుకుంటున్న చిన్నారిని చిదిమేశాడో కామాంధుడు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన అమానుష ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని జరిగింది. ప్రైవేటు బస్ డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
తన ఇంటి సమీపంలో పార్క్ చేసి ఉన్న బస్లో చిన్నారి ఆడుకుంటుడగా... నిందితుడు రేప్ చేశాడని.. పాప చనిపోయిందని భావించి గోనె సంచీలో చుట్టి రోడ్డు పక్కన పడేశాడని పోలీసులు వివరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కిడ్నాప్, పోక్సో, అత్యాచార, హత్యాయత్నం, చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:కారులో మంటలు- ఐదుగురు సజీవ దహనం
Last Updated : Dec 22, 2020, 11:40 AM IST