రమేశ్ సుబ్రమణ్యం నాయుడు... స్వస్థలం విశాఖపట్నం. ప్రస్తుతం మద్రాస్ ఐఐటీలో విద్యార్థి. పుట్టుకతోనే రమేశ్‌కు రెండు చేతులకు వేళ్లు లేవు. అయినా... లోపాలనే బలంగా మలుచుకున్నాడు. ఆత్మ స్థైర్యంతో క్రికెట్ మైదానంలోకి దిగాడు. శిక్షణ, నిబద్ధతో అద్భుత ఆటతీరు సొంతం చేసుకున్నాడు. బొటన వేలి సాయంతో అవలీలగా క్యాచ్‌లు పట్టడంలో నైపుణ్యం సాధించాడు. ఒక కాలికి పాదం లేకపోయినా ఇన్నింగ్స్‌లో 78 పరుగులు, 5 వికెట్లు తన ఖాతాలో వేసుకుని సత్తా చాటాడు. సెలక్టర్లను మెప్పించి ఇంగ్లాండ్‌లో జరిగే మొదటి దివ్యాంగుల వరల్డ్ కప్ క్రికెట్ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
" బాల్యం నుంచి క్రికెట్ ఇష్టంగా ఆడతాను. వరల్డ్ కప్‌కు ఎన్నికవ్వడం నా కల. ఇందుకోసం చాలా కష్టపడ్డాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. కచ్చితంగా దేశం కోసం కప్ గెలవడానికి ప్రయత్నిస్తాను."
-రమేశ్ సుబ్రమణ్యం నాయుడు, దివ్యాంగ క్రికెటర్.