అయోధ్యలో రామ మందిర నిర్మాణ ట్రస్ట్ ఏర్పాటు, నిధుల సమీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే. అయోధ్య ట్రస్ట్ రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నారు. ఆలయ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా.. ప్రజల నుంచి సేకరించాలని సూచించారు.
అయోధ్య భూవివాదం కేసుపై తుది తీర్పు వెలువడిన క్రమంలో మూడు నెలల్లోపు ఆలయ నిర్మాణ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సూచించింది సుప్రీం కోర్టు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పలు సభల్లో ఆలయ నిర్మాణం మూడు నెలల్లో ప్రారంభం అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పలు అంశాలను ఈటీవీ భారత్తో పంచుకున్నారు వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే. ప్రభుత్వం.. అయోధ్య రామ మందిరాన్ని త్వరగా ప్రారంభించాలని కోరారు.