రఫేల్ ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలపటంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. తాజాగా దిల్లీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు హస్తినలోని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ నివాసం ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ... మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అడ్డుకున్న పోలీసులు