తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు,మహిళలు - modi

రక్ష బంధన్​ను​ పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోదీకి చిన్నారులు, మహిళలు రాఖీ కట్టారు.ఈ సందర్భంగా చిన్నారులతో సరదాగా ముచ్చటించారు ప్రధాని.

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు,మహిళలు

By

Published : Aug 15, 2019, 10:26 PM IST

Updated : Sep 27, 2019, 3:26 AM IST

రాఖీ పూర్ణిమ సందర్భంగా చిన్నారులు, మహిళలు ప్రధాని మోదీకి రాఖీ కట్టారు. ప్రధాని నివాసంలో పాఠశాల విద్యార్థులు, పలు శాఖలకు చెందిన మహిళలు, బ్రహ్మకుమారీలు మోదీకి రాఖీ కట్టి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మోదీ వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడున్న చిన్నారులతో సరదాగా ముచ్చటించారు మోదీ.


ఈరోజు ఉదయం ఎర్ర కోటపై జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు రక్షాబంధన్‌, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందరికీ రక్షాబంధన్‌, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. నా సోదరీ, సోదరీమణులందరికీ ఈ రోజు సంతోషం, ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని చెప్పారు.

ఇదీ చూడండి:ఆర్థిక వృద్ధి చర్యలపై ప్రధాని సమాలోచనలు

Last Updated : Sep 27, 2019, 3:26 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details