చైనాతో సరిహద్దు వివాదంపై లోక్‌సభలో ప్రకటన చేశారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. సరిహద్దుల నిర్ణయానికి డ్రాగన్ దేశం ఒప్పుకోవడం లేదని చెప్పారు. ఇప్పటివరకు చైనా మొత్తం 90 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని వెల్లడించారు. చైనా కుట్రలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిందని తెలిపారు.
" 1993, 1996 ఒప్పందాలను చైనా ఉల్లంఘించింది. సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడింది. ఆగస్టులో భారత్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. డ్రాగన్ దేశం దుశ్చర్యలను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. సరిహద్దులో బలగాలను మరింత పెంచాం."
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి.
చైనా దూకుడు చర్యలతో శాంతి ఒప్పందంపై ప్రభావం పడుతుందన్నారు రాజ్‌నాథ్. ఆ దేశంలో భారత్ స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటుందని చెప్పారు. సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని.. ఎలాంటి చర్యలనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ వాకౌట్..