దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. సరిహద్దుల్లో ఘర్షణలు సృష్టించేందుకు పాక్, చైనా కుయుక్తులు పన్నుతున్నాయని మండిపడ్డారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్ఓ) పూర్తి చేసిన కీలక వంతెనలను ప్రారంభించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.
"కరోనా కారణంగా దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. వ్యవసాయ రంగం, ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక, జాతీయ భద్రత వంటి వాటిని తీవ్రంగా ప్రభావితం చేసింది కొవిడ్. మరోవైపు సరిహద్దుల్లో వివాదాలు సృష్టించేందుకు పాక్, చైనా కుట్రలు పన్నుతున్నాయి."
- రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి