రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లద్దాఖ్‌లో పర్యటించనున్నారు. సరిహద్దులో మోహరించిన సైనికులతో సంభాషించి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించనున్నారు. రక్షణమంత్రితో పాటు సైన్యాధ్యక్షుడు జనరల్ ఎంఎం నరవాణే, ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ యోగేశ్ కుమార్ సింగ్ సైతం రక్షణమంత్రి లేహ్ పర్యటనలో పాల్గొననున్నారు.
వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక సన్నద్ధతను రాజ్‌నాథ్ పరిశీలించనున్నారు. శుక్రవారం దిల్లీ నుంచి నేరుగా లేహ్‌కు బయలుదేరనున్న రాజ్‌నాథ్ గల్వాన్ ఘర్షణలో గాయపడిన సైనికులను పరామర్శిస్తారు. భద్రతా దళాలు మోహరించిన ఫార్వర్డ్ ప్రదేశాలను ఆయన సందర్శించనున్నారు.