తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్టికల్ 370, 35ఏలను రద్దుచేయాలి:రాజ్​నాథ్

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక అధికారాలను కల్పిస్తోన్న ఆర్టికల్ 370, 35ఏ లను రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ప్రత్యేక ప్రధానమంత్రి కావాలన్న ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు సరికాదని లఖ్​నవూలో జరిగిన ఓటరు అవగాహన సదస్సులో వ్యాఖ్యానించారు. కొన్ని సంస్థలు కుట్రపూరితంగా కశ్మీర్​లో వేర్పాటువాదాన్ని పెంచుతున్నాయని తెలిపారు.

ఆర్టికల్ 370, 35ఏలను రద్దుచేయాలి:రాజ్​నాథ్

By

Published : Apr 28, 2019, 10:54 PM IST

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక అధికారాలపై సమీక్షించాలన్నారు కేంద్ర హోంమంత్రి. కశ్మీర్​కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తోన్న 370, ఇతర రాష్ట్రాలవారికి శాశ్వత పౌరసత్వం కల్పించరాదన్న 35ఏలను సమీక్షించాలని లఖ్​నవూలో జరిగిన ఓటరు అవగాహన సదస్సులో అభిప్రాయపడ్డారు. అవసరమైతే వాటిని రద్దు చేయాలని ఉద్ఘాటించారు.

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రధానమంత్రి కావాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై రాజ్​నాథ్ మండిపడ్డారు. కశ్మీర్​లో కుట్రపూరితంగా కొన్ని సంస్థలు వేర్పాటువాద భావజాలాన్ని పెంచుతున్నాయని ఆరోపించారు. కానీ కశ్మీర్​లోని మెజారిటీ ప్రజలు భారత్​లోనే ఉండాలని కోరుకుంటున్నారన్నారు.

ఆర్టికల్ 370 రద్దు త్వరగా చేపట్టాలని కశ్మీరీల అభిమతం: భాజపా

జమ్ముకశ్మీర్​లోని మెజారిటీ ప్రజలు ఆర్టికల్ 370 త్వరగా రద్దు కావాలని కోరుకుంటున్నారన్నారని ప్రకటించింది ఆ రాష్ట్ర భాజపా విభాగం. పూర్తి స్థాయిలో భారత్​తో కలిసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించింది. పాకిస్థాన్​ కంటే భాజపా-ఆర్​ఎస్ఎసే కశ్మీర్​కు ప్రమాదకరమైనదన్న నేషనల్​ కాన్ఫరెన్స్ నేతల వ్యాఖ్యలపై మండిపడింది.

"కోట్లమంది భారతీయులు కోరుకుంటున్న ఆర్టికల్ 370 రద్దుపై భాజపా ఇస్తున్న హామీపట్ల నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సంతోషంగా లేరు. ఆయనకు పాకిస్థాన్​తో మాత్రం ఎంతో సౌకర్యంగా ఉంటుంది " -అనిల్ గుప్తా, ఆర్మీ బ్రిగేడియర్(రిటైర్డ్), భాజపా అధికార ప్రతినిధి

నేషనల్ కాన్ఫరెన్స్ అబ్దుల్లా కుటుంబానికి రహస్య స్నేహితులైన పాకిస్థాన్​ నుంచి తమను రక్షించేది భాజపా మాత్రమేనని కశ్మీర్ ప్రజలు నమ్ముతున్నారని ఉద్ఘాటించారు అనిల్ గుప్తా.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియా లక్ష్యం- 20 లక్షల పిల్లులు!

ABOUT THE AUTHOR

...view details