తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రష్యా- భారత్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం'

రష్యాతో భారత సంబంధాలు ప్రత్యేకమైనవని ఉద్ఘాటించారు రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్. ఇటీవల రష్యా పర్యటనకు వెళ్లిన ఆయన ఆ దేశంతో చర్చలు సఫలమయ్యాయని.. ప్రస్తుతం అమలులో ఉన్న ఒప్పందాలు త్వరలో కార్యరూపం దాలుస్తాయని చెప్పారు. 75వ విక్టరీడే పరేడ్​కు వెళ్లిన ఆయన కరోనా విజృంభణ అనంతరం చేసిన తొలిపర్యటన ఇదేనని చెప్పారు.

rajnath
'రష్యాతో చర్చలు ఫలప్రదం.. త్వరలో కార్యరూపంలోకి ఒప్పందాలు '

By

Published : Jun 23, 2020, 8:44 PM IST

Updated : Jun 23, 2020, 11:07 PM IST

రష్యా పర్యటనలో ఉన్న రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్ ఆ దేశంతో జరిగిన చర్చలపై ప్రకటన విడుదల చేశారు. భారత్​- రష్యా సంబంధాలు ప్రత్యేకమైనవని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టులు త్వరలో కార్యరూపం దాలుస్తాయని చెబుతూ.. ఎస్-400 క్షిపణి రక్షక వ్యవస్థలు త్వరలో భారత్​కు చేరతాయని పరోక్షంగా వెల్లడించారు.

రష్యా అంటే ప్రీతి..

రెండో ప్రపంచయుద్ధంలో మరణించిన రష్యా సైనికులకు నివాళులు అర్పించారు రాజ్​నాథ్​. భారత్​ కూడా నాటి యుద్ధంలో పాల్గొందని.. అందులో తమ సైనికులు కూడా మృతిచెందారని గుర్తుచేశారు. కరోనా అనంతర పరిస్థితుల్లో భారత రక్షణమంత్రిగా తొలిసారి రష్యాలోనే పర్యటించానని.. భారత్- రష్యా స్నేహబంధానికి ఇదే నిదర్శనమన్నారు.

పుతిన్​కు ఆహ్వానం..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​.. భారత్​కు విచ్చేయనున్నట్లు తెలిపారు రాజ్​నాథ్. ఈ పర్యటన ఈ ఏడాది చివర్లో ఉండే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

చైనా రక్షణమంత్రితో భేటీ రద్దు..

మాస్కో వేదికగా చైనా రక్షణమంత్రితో రాజ్​నాథ్ భేటీ కావాల్సి ఉండగా ఇది రద్దయింది. ఈ విషయాన్ని ఇంతకుముందే పలు చైనా వెబ్​సైట్లు ప్రకటించాయి.

ఇదీ చూడండి:'గూఢచారి' పాక్​ విషయంలో భారత్​ తీవ్ర నిర్ణయం

Last Updated : Jun 23, 2020, 11:07 PM IST

ABOUT THE AUTHOR

...view details