తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వీర కల్నల్​ అశుతోష్​కు కన్నీటి వీడ్కోలు - అనుజ్​ సూద్​

జమ్ముకశ్మీర్​ హంద్వారా ఎన్​కౌంటర్​లో అమరుడైన.. కల్నల్​ అశుతోష్​ శర్మ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. సైనిక వందనాలతో తుది వీడ్కోలు పలికారు. జైపుర్​లోని మిలిటరీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి సైనిక సంక్షేమ మంత్రి, ఇతర సైనికాధికారులు హాజరయ్యారు.

Rajasthan CM, South Western Army chief pay tributes Col Ashutosh Sharma
కల్నల్​ అశుతోష్​కు కన్నీటి వీడ్కోలు.. ప్రముఖుల నివాళి

By

Published : May 5, 2020, 11:40 AM IST

ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొంది అమరుడైన కల్నల్​ అశుతోష్​ శర్మకు కన్నీటి ధారల నడుమ తుది వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు, వేర్వేరు రంగాల ప్రముఖులు. రాజస్థాన్​ జైపుర్​లోని కావేల్రీ మిలిటరీ మైదానంలో అధికారిక లాంఛనాల నడుమ ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్.. కల్నల్​ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అశుతోష్​ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సౌత్​ వెస్టర్న్​ ఆర్మీ చీఫ్​ లెఫ్టినెంట్​ జనరల్​ అలోక్​ ఖేర్​, సైనిక సంక్షేమ మంత్రి ప్రతాప్​ సింగ్​ తదితరులు.. అశుతోష్​కు కన్నీటి వీడ్కోలు పలికారు.

కల్నల్​ పార్థివదేహానికి సైనికవందనం
రాజస్థాన్​ సీఎం గహ్లోత్​ నివాళి
కల్నల్​ కుటుంబసభ్యుల అశ్రునివాళి

అశుతోష్​... 12 సార్లు పరీక్షల్లో విఫలమై, 13వ ప్రయత్నంలో సైన్యంలో చేరారు. 21 రాష్ట్రీయ రైఫిల్స్​ విభాగం కమాండింగ్​ ఆఫీసర్​ అయిన కల్నల్​ గతంలో ఎన్నో ఉగ్రనిరోధక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. రెండుసార్లు ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక సేన పురస్కారాన్ని అందుకున్నారు. హంద్వారాలో ఉగ్రవాదుల చెరలో ఉన్న పౌరుల్ని రక్షించే క్రమంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు విడిచారు. ఆ ఘటనలో మరో ఐదుగురు భద్రతా సిబ్బంది కూడా మరణించారు.

భాజపా ఎంపీ రాజ్యవర్ధన్​ సింగ్​ రాఠోడ్​

ఈ ఘటనలో అమరుడైన మరో సైనికాధికారి, మేజర్​ అనుజ్​ సూధ్​.. అంత్యక్రియలు హరియాణాలోని పంచకులలో నిర్వహించారు. కుటుంబసభ్యులు, ఇతర సిబ్బంది హాజరయ్యారు.

అనుజ్​ సోధ్​ పార్థివ దేహాన్ని తరలిస్తున్న సైనిక సిబ్బంది
అనుజ్​ కుటుంబసభ్యులు

ABOUT THE AUTHOR

...view details