రాజస్థాన్లోని పాలీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తోన్న బస్సు ఆగి ఉన్న మరోబస్సును ఢీకొంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో 19మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
నెత్తురోడిన రాజస్థాన్ రహదారి - రోడ్డు ప్రమాదం
రాజస్థాన్ పాలీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా మరో 20మంది గాయపడ్డారు.
నెత్తురోడిన రాజస్థాన్ రహదారి
తమ బస్సుల్లోకే ప్రయాణీకులను ఎక్కించుకోవాలన్న చోదకుల తొందరే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు అహ్మదాబాద్ నుంచి జైపూర్నకు వెళుతున్నట్లు సమాచారం.