తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'న్యాయ్'​పై రాహుల్​తో చర్చలు నిజమే: రాజన్​ - రాహుల్​

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ 'న్యాయ్' పథకానికి సంబంధించి తనతో చర్చించారని ఆర్బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్​ స్పష్టం చేశారు. ఇది పేదలకు ఎంతో ఉపయోగకరమైన పథకమని పేర్కొన్నారు.

న్యాయ్

By

Published : Mar 28, 2019, 6:55 AM IST

Updated : Mar 28, 2019, 7:37 AM IST

రాహుల్​తో చర్చలు నిజమే: రాజన్​
ఆర్బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్​ కాంగ్రెస్​ ప్రకటించిన "న్యాయ్​" హామీ విలువైనదిగా, పేదలకు ఉపయోగపడేదిగా ఉందని అన్నారు.

చిన్న, సన్న కారు రైతులనుద్దేశించి భాజపా సర్కారు ప్రవేశపెట్టిన కిసాన్​ సమ్మాన్​, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ ప్రకటించిన 'న్యాయ్​' పథకం రెండూ నగదు బదిలీతో సంబంధం కలిగినవే. దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు నగదు బదిలీ సహాయపడతుంది రాజన్​ అన్నారు.

అయితే బడ్జెట్​లో నిధుల అందుబాటు, రాయితీలు.. ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు పథకాలపై నిర్ణయాలు తీసుకోవాలన్నారు రాజన్.
చర్చలు నిజమే
న్యాయ్​ పథకం గురించి కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ , మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిందబరం తనతో చర్చించారని రాజన్​ స్పష్టం చేశారు.

ప్రస్తుతం చెప్పలేను..

కూటమి గెలిస్తే ఆర్థిక శాఖ మంత్రిగా రాజన్​ ఉంటారన్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. "ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఇప్పుడు దీనిపై నేనేమీ చెప్పలేను. ప్రస్తుతం నిర్వర్తిస్తున్న బాధ్యతల పట్ల సంతోషంగా ఉన్నాను" అని రాజన్ తెలిపారు.

విమర్శకుల వాదన తప్పు:

'న్యాయ్'​ లాంటి ఉచిత పథకాలతో ప్రజలు పని చెయ్యరు అని వస్తున్న విమర్శలను తప్పుబట్టారు రాజన్​. ఇది సరైన వాదన కాదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పథకాలు... పేదల నిత్యావసరాలు తీర్చటమే కాక, వారి వృద్ధికి దోహదం చేస్తాయని రాజన్​ ఆశాభావం వ్యక్తం చేశారు.

Last Updated : Mar 28, 2019, 7:37 AM IST

ABOUT THE AUTHOR

...view details