తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎక్స్​ప్రెస్​ రైల్లో మంటలు- ప్రయాణికులు సురక్షితం - మంటలు

దిల్లీ-భువనేశ్వర్​ మధ్య నడిచే రాజధాని ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డట్లు అధికారులు వెల్లడించారు.

ఎక్స్​ప్రెస్​ రైల్లో మంటలు- ప్రయాణికులు సురక్షితం

By

Published : May 11, 2019, 4:20 PM IST

ఎక్స్​ప్రెస్​ రైల్లో మంటలు- ప్రయాణికులు సురక్షితం

కదులుతున్న రైల్లో మంటలు చెలరేగిన ఘటన ఒడిశాలోని బాలేశ్వేర్, సోరో రైల్వే స్టేషన్ల మధ్య కంటాపదకు సమీపంలో జరిగింది. దిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న రాజధాని ఎక్స్​ప్రెస్​లోని జనరేటర్ బోగిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ప్రమాదం జరగకుండా కాపాడినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12.50 నుంచి 1 గంట మధ్య ఈ ప్రమాదం సంభవించినట్లు చెప్పారు.

మంటలను ఆర్పేందుకు మూడు అగ్నిమాపక వాహనాల్ని ఉపయోగించారు. బోగీని రైలు నుంచి వేరు చేసి, ట్రాక్​పైనున్న విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
కంటాపద నుంచి మరో జనరేటర్ బోగి సహాయంతో రైలు భువనేశ్వర్​కు బయలుదేరిందని సమాచారం.

ఇదీ చూడండి: ఒకే రోజు 2 స్పైస్​జెట్​ విమానాలకు ముప్పు!

ABOUT THE AUTHOR

...view details