తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో భారీ వర్షాలకు 14 మంది మృతి - RAINS

ఉత్తరప్రదేశ్​లో భారీ వర్షాలు ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత తొమ్మిది రోజులుగా కురిసిన వర్షాలకు 14 మంది బలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా నదులన్నీ ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్​లో భారీ వర్షాలు

By

Published : Jul 13, 2019, 5:36 AM IST

Updated : Jul 13, 2019, 7:33 AM IST

ఉత్తరప్రదేశ్​లో భారీ వర్షాలు

ఉత్తరప్రదేశ్​ను వర్షాలు కుదిపేస్తున్నాయి. గత తొమ్మిది రోజులుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. జులై 3 నుంచి 11వ తేదీ వరకు కురిసిన వర్షాలకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఫతేపుర్​లో ముగ్గురు.. వర్షాలకు బలయ్యారు. మహోబా, పిలిభిత్​, కాన్పూర్​ దేహత్​, సోంభద్రా, హర్దోయ్​, కుషీనగర్​, ప్రతాప్​గఢ్​, సితాపుర్​, కన్నౌజ్​, బారాబంకీ, జాన్​పుర్​లో ఒక్కొక్కరు మృతిచెందారు.

రాష్ట్రవ్యాప్తంగా గంగా, యమున, శారదా, గోమతి, రామ్​గంగా, రాప్తితో పాటు ఇతర నదులన్నీ ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతూ.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ప్రకటించారు.

హతా, రామ్​నగర్​లో 15 సెంటీమీటర్లు, ఫతేపుర్​లో 11, బల్​రామ్​పుర్​, గోరఖ్​పుర్​లో 10, షాజాన్​పుర్​, హైదర్​ఘాట్​, ఎలిజిన్​బ్రిడ్జ్​ ప్రాంతాల్లో 9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ​

Last Updated : Jul 13, 2019, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details