తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పీఎం కేర్స్​కు విరాళాల వెల్లువ- రైల్వే రూ.151కోట్లు - Coronavirus: Kalyan Jewellers to spend Rs 10 cr to provide food, essential items to needy

కరోనా నియంత్రణ కోసం విరాళాలను సేకరణకై ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'పీఎం కేర్స్'కు​ విశేష స్పందన లభిస్తోంది. తాజాగా పీఎం కేర్స్​కు రైల్వేశాఖ.. రూ. 151 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్​ ప్రకటించారు. ఏఏఐ సంస్థ కూడా 20 కోట్లు విరాళంగా అందించింది.

Railways to donate Rs 151 cr to PM-CARES fund: Piyush Goyal
పీఎం కేర్స్​కు విరాళాల వెల్లువ- రైల్వే రూ.151కోట్లు

By

Published : Mar 29, 2020, 4:35 PM IST

కరోనాపై పోరుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్​(ప్రధానమంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్)కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రత్యేక నిధికి దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విరాళాలు విస్తృతంగా వచ్చి చేరుతున్నాయి.

రైల్వేశాఖ..

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు రైల్వేశాఖ రూ.151 కోట్లను పీఎం కేర్స్​కు విరాళంగా ఇస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్​ గోయెల్​ ప్రకటించారు. ఈ మొత్తంలో ఆయన ఒక నెల జీతం, కేంద్ర రైల్వేశాఖ సహయ మంత్రి సురేశ్​ అంగడి ఒక నెల జీతంతో పాటు.. 13 లక్షల మంది రైల్వే ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఒక రోజు జీతం ఉందని పేర్కొన్నారు.

ఏఏఐ 20 కోట్లు...

కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు తమ సిబ్బంది 20 కోట్ల రూపాయలను పీఎం కేర్స్​కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఏఏఐ) తెలిపింది.

ఒక రోజు జీతం...

పీఎం కేర్స్​కు ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇవ్వటానికి ముందుకు వచ్చారు కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులు. మొత్తం 6 వేల మంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కల్యాణ్​ జువెలర్స్​..

కల్యాణ్​ జువెలర్స్​ సంస్థ రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించింది. ఈ మొత్తాన్ని పేద ప్రజలకు ఆహరం, ఇతర నిత్యావసరాలను అందించటానికి స్థానిక ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో తమ సంస్థలో పని చేస్తున్న 8 వేల మంది ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్​ నెలలకు సంబంధించిన పూర్తి జీతాన్ని ఇస్తున్నట్లు తెలిపింది.

రాష్ట్రపతికి ప్రధాని కృతజ్ఞతలు..

పీఎం కేర్స్​కు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ.. రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. తన చర్యలతో దేశంలోని ఎంతో మందికి రాష్ట్రపతి స్ఫూర్తినిస్తున్నారని ట్వీట్​ చేశారు.

సామాజిక బాధ్యతగానే...

ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పీఎం కేర్స్​కు అందించే విరాళాలను కూడా కంపెనీ చట్టం ప్రకారం సామాజిక బాధ్యతగానే పరిగణించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

కంపెనీ చట్టం ప్రకారం ప్రతి కార్పొరేట్​ సంస్థ ప్రతి మూడేళ్లకు వచ్చే నికర లాభంలో కనీసం 2 శాతం లాభాన్ని సామాజిక బాధ్యతగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. గడిచిన ఐదేళ్లలో కార్పొరెట్​ సంస్థలన్ని కలిసి 52 వేల కోట్లను సామజిక సంక్షేమానికి ఉపయోగించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి:గర్భిణికి కరోనా సోకితే.. పుట్టే బిడ్డ పరిస్థితి ఏంటి?

ABOUT THE AUTHOR

...view details