ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వైరస్ బాధితులకోసం 204 కోచ్‌లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు రైల్వే అధికారులు. ఇందులో దిల్లీ కోసం శకుర్‌బస్తీ రైల్వేస్టేషన్లో 54 కోచ్‌లను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో దిల్లీలోని మహమ్మారి బాధితుల కోసం ఐసోలేషన్ కోచ్‌ల సంఖ్య 500 వరకు పెంచుతామని స్పష్టం చేశారు.
దిల్లీలోవైరస్ విజృంభణపై సమీక్షించినకేంద్ర హోంమంత్రి అమిత్ షా పడకల కొరత దృష్యా అన్ని సౌకర్యాలతో కూడిన 500 రైల్వే కోచ్‌లను అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పడకలను సిద్ధం చేస్తుంది రైల్వేశాఖ.
ఉత్తర్‌ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దిల్లీ రాష్ట్రాలు 5 వేల సాధారణ కోచ్‌లను కొవిడ్ కేంద్రాలుగా మార్చాలని కోరినట్లు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు 70, దిల్లీకి 54, తెలంగాణకు 60, ఆంధ్రప్రదేశ్‌కు 20 కోచ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 24 ప్రాంతాలకు గాను ఉత్తరప్రదేశ్ 240 కోచ్‌లను, తెలంగాణ 60, దిల్లీ 10 కోచ్‌లను కోరినట్లు తెలిపారు.