తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​కు ఊరట- అమేఠీ నామినేషన్​కు ఓకే

రాహుల్​ గాంధీ అమేఠీ నామినేషన్​పై అభ్యంతరాలను ఎన్నికల రిటర్నింగ్​ అధికారి తోసిపుచ్చారు. కాంగ్రెస్​ అధ్యక్షుడి నామినేషన్​ చెల్లుబాటవుతుందని స్పష్టం చేశారు.

రాహుల్​ అమేఠీ నామపత్రం చెల్లుతుంది:ఆర్వో

By

Published : Apr 22, 2019, 4:32 PM IST

Updated : Apr 22, 2019, 4:48 PM IST

రాహుల్​కు ఊరట- అమేఠీ నామినేషన్​కు ఓకే

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేఠీ నామినేషన్​ పత్రాలపై వచ్చిన అభ్యంతరాలను ఎన్నికల రిటర్నింగ్​ అధికారి(ఆర్వో) తోసిపుచ్చారు. రాహుల్​ గాంధీ తరఫు న్యాయవాది వాదనలు విన్న తర్వాత అమేఠీ ఆర్వో రామ్​ మనోహర్​ మిశ్రా ఈ నిర్ణయం తీసుకున్నారు. పౌరసత్వం, ఇతర విషయాలపై అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం నామినేషన్​ పత్రం చెల్లుబాటవుతుందని స్పష్టంచేశారు.

రాహుల్​ గాంధీ నామినేషన్​పై ఆమేఠీ నుంచి పోటీ చేస్తోన్న స్వతంత్ర అభ్యర్థి, మరో ముగ్గురు శనివారం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాహుల్​ ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్న విద్యార్హతలు, పౌరసత్వంపై అనుమానాలున్నాయన్నారు.

బ్రిటన్​ రిజిస్టర్డ్​ సంస్థ సర్టిఫికెట్​లో కాంగ్రెస్​ నాయకుడు తాను బ్రిటిష్​ పౌరునిగా పేర్కొన్నట్లు ఫిర్యాదుదారు ధ్రువ్​ లాల్​ తరఫు న్యాయవాది రవి ప్రకాశ్ ఆరోపించారు. సంబంధిత పత్రాలను రిటర్నింగ్​ అధికారికి సమర్పించారు. రాహుల్​ పౌరసత్వంపై అనుమానాలు నివృతి చేయాలని డిమాండ్​ చేశారు. యూకే పౌరసత్వం నిజమైతే రాహుల్ లోక్​సభ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని స్పష్టంచేశారు.

చివరకు రాహుల్​ నామినేషన్​ చెల్లుబాటు అవుతుందని ఎన్నికల అధికారి ప్రకటించారు.

Last Updated : Apr 22, 2019, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details