తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీది యూ-టర్న్... అయినా థ్యాంక్స్: రాహుల్

ఉపాధి హామీ పథకం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ యూ-టర్న్​ తీసుకున్నారని ట్వీట్ చేశారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ఒకప్పుడు ఈ పథకం వైఫల్యమని చెప్పిన ఆయనే ఇప్పుడు అదనంగా రూ.40వేల కోట్ల నిధులు కేటాయించారని కృతజ్ఞతలు తెలిపారు.

Rahul takes dig at PM for 'U-turn' on MGNREGA
మోదీ యూ టర్న్ తీసుకున్నారని రాహుల్​ వ్యంగ్యం

By

Published : May 18, 2020, 5:30 PM IST

Updated : May 18, 2020, 6:01 PM IST

ప్రధాని నరేంద్రమోదీపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో మోదీ యూ-టర్న్​ తీసుకున్నారని ట్వీట్​ చేేశారు. ఆ పథకం లక్ష్యం ఏమిటో ఇప్పటికైనా అర్థం చేసుకుని నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

" యూపీఏ హయాంలో ప్రారంభమైన ఉపాధి హామీ పథకం కోసం అదనంగా రూ.40వేల కోట్ల నిధులు కేటాయించారు. పథకం ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు "

-రాహుల్​ ట్వీట్​.

ఈ ట్వీట్​లో #ModiUturnOnMNREGA హ్యాష్​ ట్యాగ్​ను ఉపయోగించారు రాహుల్​. 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక పార్లమెంటులో ప్రసంగిస్తూ ' కాంగ్రెస్ వైఫల్యాలకు ఉపాధి హామీ పథకం సజీవ స్మారక చిహ్నం. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా ఇంకా ప్రజలను గుంతలు తవ్వడానికి పంపుతోంది' అన్న మాటల వీడియోను ట్వీట్​కు జత చేశారు.

Last Updated : May 18, 2020, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details