తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ వారాంతం వరకు సమయం కావాలి: రాహుల్​

షోకాజ్​ నోటీసుపై స్పందించేందుకు తనకు ఈ వారాంతం వరకు సమయం కావాలని ఎన్నికల సంఘాన్ని కోరారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ. 'మోదీ ప్రభుత్వం గిరిజనులను చంపడానికి కొత్త చట్టాన్ని రూపొందించింది' అని ఏప్రిల్​ 23న మధ్యప్రదేశ్​లో జరిగిన బహిరంగసభలో అన్నారు రాహుల్​. ఈ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసింది భాజపా. ఆ ఫిర్యాదుపై ఈ నెల1న రాహుల్​కు నోటీసులిచ్చింది ఈసీ.

By

Published : May 8, 2019, 5:32 AM IST

Updated : May 8, 2019, 7:00 AM IST

ఈ వారాంతం వరకు సమయం కావాలి: రాహుల్​

ఈ వారాంతం వరకు సమయం కావాలి: రాహుల్​

షోకాజ్​ నోటీసుపై స్పందించడానికి ఈ వారాంతం వరకు సమయం ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. మధ్యప్రదేశ్​లో జరిగిన ఓ ఎన్నికల బహిరంగ సభలో... 'మోదీ ప్రభుత్వం, గిరిజనులను చంపడానికి కొత్త చట్టాన్ని రూపొందించింది' అని రాహుల్​గాంధీ వ్యాఖ్యానించారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని భాజపా ఈసీకి ఫిర్యాదు చేసింది. రాహుల్​కు ఈసీ ఈ నెల1న షోకాజ్​ నోటీసు జారీ చేసింది.

నోటీసుపై స్పందించడానికి తనకు ఈ నెల 7 వరకు సమయం ఇవ్వాలని ఈసీని గతంలో కోరారు రాహుల్​. అందుకు ఎన్నికల సంఘం అనుమతించింది. తాజాగా ఈ గడువును ఈ వారాంతం వరకు పొడిగించాలని రాహుల్​ మరోసారి అభ్యర్థించారు. ఈ​ అభ్యర్థనపై ఎన్నికల సంఘం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.

మధ్యప్రదేశ్​ షాదోల్​లో ఏప్రిల్​ 23న​ లోక్​సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్​ పాల్గొన్నారు. 'మోదీ ప్రభుత్వం, గిరిజనులను చంపడానికి కొత్త చట్టాన్ని రూపొందించింది' అని వ్యాఖ్యానించారు. దీనిపై ఈసీకిభాజపా ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఈనెల 1న రాహుల్​కు ఈసీ షోకాజ్​ నోటీసులు జారీచేసింది. రాజకీయ ప్రత్యర్థులపై నిరాధార ఆరోపణలు చేయడం పట్ల వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: 'అంతర్గత విచారణ కమిటీ నివేదిక ప్రతి ఇవ్వండి'

Last Updated : May 8, 2019, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details