లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వీడి తీరాలని దృఢ నిశ్చయంతో రాహుల్ గాంధీ. అయితే ఆ ఆలోచన విరమించుకునేలా రాహుల్‌ను ఒప్పించేందుకు సీనియర్ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు రణ్‌దీప్ సుర్జేవాలా, సచిన్ పైలట్, అశోక్ గహ్లోత్ ఈ ఉదయం రాహుల్‌తో సమావేశమయ్యారు. అధ్యక్ష బాధ్యతలు వీడొద్దని మరోసారి కోరారు.
ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ 52 సీట్లు మాత్రమే గెలిచి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓటమిని సమీక్షించుకునేందుకు 25న కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం అధ్యక్ష పదవిని వీడతానని ప్రతిపాదించారు రాహుల్. హతాశులయిన పార్టీనేతలు రాహుల్ నిర్ణయాన్ని తిరస్కరించారు.
పలు రాష్ట్రాల్లో ఖాతా తెరవకపోవడం, కొన్ని రాష్ట్రాల్లో ఒకటి, రెండు సీట్లు మాత్రమే సాధించడం రాహుల్‌ను తీవ్రంగా బాధించిందని సమాచారం.