తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏడీసీ పరువు నష్టం కేసులో రాహుల్​కు బెయిల్ - defamation case

పరువు నష్టం కేసులో కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీకి గుజరాత్​లోని అహ్మదాబాద్ మెజిస్ట్రేట్​ కోర్టు బెయిల్​ మంజూరు చేసింది. అహ్మదాబాద్ జిల్లా కో ఆపరేటివ్​ బ్యాంక్(ఏడీసీ) ఛైర్మన్​ అజయ్​ పటేల్​ గతేడాది ఈ పరువునష్టం దావా వేశారు.

తప్పు చేయలేదన్న రాహుల్, బెయిల్ ఇచ్చిన కోర్టు

By

Published : Jul 12, 2019, 6:09 PM IST

కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పరువు నష్టం కేసులో అహ్మదాబాద్​ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాహుల్​పై అహ్మదాబాద్ జిల్లా కో ఆపరేటివ్​ బ్యాంక్(ఏడీసీ) ఛైర్మన్​ అజయ్​ పటేల్​ గతేడాది ఈ పరువు నష్టం దావా వేశారు.

విచారణకు స్వయంగా హాజరయ్యారు రాహుల్. తనపై వచ్చిన అభియోగాలు అంగీకరిస్తున్నారా అని రాహుల్​ను అడిగారు అదనపు చీఫ్​ మెట్రోపాలిటన్​ మెజిస్ట్రేట్​ ఎన్​. బీ మున్షి. అందుకు రాహుల్​ నిరాకరించారు. అనంతరం బెయిల్​ మంజూరైంది.

ఈ కేసు విచారణ కోసం కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్​సింగ్​ సుర్జేవాలా శనివారం అహ్మదాబాద్​ మెజిస్ట్రేట్​ కోర్టు ముందు హాజరుకానున్నారు.

కేసు వివరాలు..

రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణదీప్​ సుర్జేవాలా గతంలో.. అహ్మదాబాద్​ జిల్లా సహకార బ్యాంకుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2016 నవంబర్ 8న నోట్లరద్దు ప్రకటించిన ఐదు రోజుల్లో.. రూ.745.59 కోట్ల మేర ఈ బ్యాంకు నోట్ల మార్పిడి కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు.

ముంబయికి చెందిన ఓ కార్యకర్త ఆర్​టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్​ రూరల్ డెవలప్​మెంట్ ఇచ్చిన సమాధానం ఆధారంగానే రాహుల్ గాంధీ, సుర్జేవాలా ఏడీసీ బ్యాంకుపై ఆరోపణలు చేశారు.

అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఏడీసీ బ్యాంకుతో పాటు ఛైర్మన్ అజయ్​ పటేల్ వ్యక్తిగతంగా​... ఈ ఇరువురు నేతలపై పరువునష్టం కేసు దాఖలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్​షా ఈ ఏడీసీ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరు కావడం గమనార్హం.

ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం ఏప్రిల్ 9న రాహుల్​గాంధీ, రణ్​దీప్​​ సుర్జేవాలాకు సమన్లు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details