తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనాపై చర్చకు సిద్ధమా? రాహుల్​కు 'షా' సవాల్​

చైనాతో సరిహద్దు ఘర్షణపై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు హోంమంత్రి అమిత్​షా. ఏఎన్​ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అపరిపక్వ రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. 1962 నుంచి చైనాతో సంబంధాలపై పార్లమెంట్ వేదికగా చర్చిద్దామా? అని సవాల్​ విసిరారు.

amithshah
'రాహుల్​.. చైనాపై పార్లమెంట్​లో చర్చకు సిద్ధమా?'

By

Published : Jun 28, 2020, 5:02 PM IST

చైనాతో సరిహద్దు వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు హోంమంత్రి అమిత్​షా. రాహుల్ అపరిపక్వ రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన చేస్తున్న విమర్శలకు పాకిస్థాన్, చైనాల్లో స్వాగతం లభించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. 1962 యుద్ధం నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఘటనలపై పార్లమెంట్ వేదికగా చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు అమిత్​షా. ఏఎన్​ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ సహా విపక్షాల విమర్శలపై సమాధానమిచ్చారు షా.

రాహుల్ 'సరెండర్ మోదీ' హ్యాష్​ట్యాగ్​తో పోస్ట్​ చేసే అంశాలకు చైనా, పాక్​లో ప్రోత్సాహం లభించడంపై కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పారు అమిత్​ షా. ఓ పెద్ద రాజకీయ పార్టీ మాజీ అధ్యక్షుడైన రాహుల్ సంక్షోభ సమయంలో అపరిపక్వ విమర్శలు చేయడం సరికాదన్నారు.

"మేం భారత్​ వ్యతిరేక వ్యాఖ్యలను సమర్థంగా ఎదుర్కోగలం. అయితే సంక్షోభ సమయంలో ఓ పార్టీ మాజీ అధ్యక్షుడు ఇలా అపరిపక్వ రాజకీయాలు చేయడం సరికాదు. ఆయన 'సరెండర్​ మోదీ' హ్యాష్​ట్యాక్ పోస్టులపై పాక్, చైనాల్లో లభిస్తున్న ప్రోత్సాహంపై కాంగ్రెస్ నేతలు.. ఆ పార్టీ అత్మపరిశీలన చేసుకోవాలి."

-అమిత్​షా, హోంమంత్రి

'ఇప్పుడే చెప్పలేం..'

ప్రస్తుతం చైనా సేనలు భారత భూభాగంలో ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు షా. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులను ఇప్పుడే వ్యాఖ్యానించడం సరికాదన్నారు.

'పార్లమెంట్​లో చర్చకు సిద్ధమా..'

పొరుగుదేశాలతో వ్యవహారాలపై చర్చకు సిద్ధమేనా అని కాంగ్రెస్​కు సవాలు విసిరారు అమిత్​షా. 1962 నుంచి ఇప్పటివరకు ప్రతి అంశాన్ని చర్చిద్దామన్నారు. జవాన్లు ఘర్షణను ఎదుర్కొంటున్న వేళ.. పాక్, చైనాలను సంతోషపెట్టే వ్యాఖ్యలను రాహుల్ చేయకుండా ఉండాల్సిందన్నారు.

'మీ పార్టీలో ప్రజాస్వామ్యమా?'

భాజపాలో ప్రజాస్వామ్యం లేదన్న కాంగ్రెస్ విమర్శలకు సమాధానమిచ్చారు షా. 'భాజపాలో అధ్యక్షుడిగా అడ్వాణీ అనంతరం రాజ్​నాథ్​ సింగ్, నితిన్​ గడ్కరీ, నేను, జేపీ నడ్డా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికవుతూ వస్తున్నాం. గాంధీ కుటుంబయేతరులు కాంగ్రెస్​కు నేతృత్వం వహించగలరా' అని ప్రశ్నించారు.

ఇవీ చూడండి: ఆ రెండు యుద్ధాల్లో భారత్​దే గెలుపు.. కానీ..: షా

'పరీక్షలు పెంచాం.. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయ్​'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details