తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంపకాల చర్చలు - seats

జేడీఎస్​ అగ్రనేత దేవేగౌడతో కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ భేటీ అయ్యారు. కర్ణాటకలోని లోక్​సభ స్థానాల పంపకాలపై చర్చించారు.

దేవేగౌడతో రాహుల్ ​భేటీ

By

Published : Mar 6, 2019, 1:32 PM IST

మాజీ ప్రధాని, జేడీఎస్​ పార్టీ అగ్రనేత హెచ్​.డి.దేవేగౌడతో భేటీ అయ్యారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. కర్ణాటకలో లోక్​సభ సీట్ల పంపకం, సర్దుబాట్లపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.

10 సీట్లు అడిగాం...

మాట్లాడుతున్న దేవేగౌడ

"కర్ణాటకలో మొత్తం 28 లోక్​సభ స్థానాలు ఉన్నాయి. వాటిలో 10స్థానాలను మా పార్టీకి కేటాయించాలని అడిగాం. కాంగ్రెస్​ నేత కేసీ వేణుగోపాల్​, మా పార్టీ నాయకుడు డానిష్​ అలీలతో రాహుల్​ గాంధీ చర్చించాక తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. "-- దేవేగౌడ, జేడీఎస్​ అగ్రనేత

ఆ ప్రాంతం ప్రత్యేకం

దక్షిణ కర్ణాటక పాత మైసూరు ప్రాంతంలోని లోక్​సభ సీట్లపైనే కాంగ్రెస్​, జేడీఎస్​ ప్రధానంగా సమాలోచనలో పడ్డాయి. ఆ ప్రాంతంలోని మాండ్య, హాసన్​ లోక్​సభ స్థానాలను జేడీఎస్​కు కేటాయించేందుకు సుముఖంగా ఉంది కాంగ్రెస్.

కాంగ్రెస్​తోనే ముందుకు..

కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వంలో భేదాభిప్రాయాలు ఉన్నాయనే వాదనలు ఎన్నో వస్తున్నాయి. అయినా జేడీఎస్​ అగ్రనాయకత్వం వాటిని కొట్టేస్తూ వస్తోంది. కాంగ్రెస్​తోనే ముందుకు సాగుతామని స్పష్టంగా చెబుతోంది. లోక్​సభ ఎన్నికల్లో హస్తం పార్టీతోనే పొత్తు ఉంటుందని ఇటీవలే వ్యాఖ్యానించారు ఆ పార్టీ అగ్రనేత దేవేగౌడ. ఈ మేరకు నేడు ఇరువురు నేతలు భేటీ కావడం వల్ల పొత్తు తథ్యమనే సంకేతాలను పంపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details