ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా, ఆర్ఎస్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడితే కోర్టు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు దేశంలో నెలకొని ఉన్నాయన్నారు.
బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా పట్నా కోర్టుకు హాజరయ్యారు రాహుల్. ఈ కేసులో ఆయనకు ఊరట లభించింది. రాహుల్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
"ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు, మోదీ భావజాలానికి వ్యతిరేకంగా నిల్చున్నవారు దాడి, కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజ్యాంగాన్ని రక్షించేందుకు, పేద ప్రజల పక్షాన గళం విప్పేందుకు, రైతులకు బాసటగా నిలిచేందుకే పోరాటం చేస్తున్నాను. ఈ కారణంగానే నేను ఇక్కడికి వచ్చాను. కొంతమంది వ్యక్తులను రక్షించేందుకు దేశం కోసం పోరాడే వారిక గొంతు నొక్కుతున్నారు. నా పోరాటం కొనసాగిస్తాను."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత