తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏప్రిల్​ 26 ముప్పు: రాహుల్​ విమానంలో సమస్య - Rahul Gandhi

2018 ఏప్రిల్​ 26... రాహుల్​ గాంధీ విమానంలో సాంకేతిక సమస్య. ప్రమాదం తప్పింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏడాది గడిచింది. 2019 ఏప్రిల్​ 26... మరోమారు రాహుల్​ విమానం ఇంజిన్​లో సాంకేతిక లోపం. సురక్షితంగా బయటపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.

ఏప్రిల్​ 26 ముప్పు: రాహుల్​ విమానంలో సమస్య

By

Published : Apr 26, 2019, 2:50 PM IST

Updated : Apr 26, 2019, 3:37 PM IST

ఏప్రిల్​ 26 ముప్పు: రాహుల్​ విమానంలో సమస్య

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ విమాన ఇంజిన్​కు సాంకేతిక సమస్య ఎదురైంది. బిహార్​లోని సమస్తిపుర్​లో ఎన్నికల సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఫలితంగా... విమానాన్ని వెంటనే దిల్లీకి మళ్లించారు. రాహుల్​ ఈ విషయాన్ని ట్విట్టర్​లో వెల్లడించారు.

"ఈరోజు పట్నాకు వెళ్తుండగా ఇంజిన్​లో సాంకేతిక సమస్య వచ్చింది. అందుకే దిల్లీకి తిరుగు పయనమవ్వక తప్పలేదు. సమస్తిపుర్​(బిహార్​), బాలేశ్వర్​(ఒడిశా), సంగమ్నార్​(మహారాష్ట్ర)లో ఈ రోజు జరగాల్సిన సభలు ఆలస్యంగా జరుగుతాయి. అసౌకర్యానికి క్షమాపణలు."
- రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

ఇద్దరు విమాన సిబ్బందితో కలిపి మొత్తం పది మందితో వెళ్తున్న రాహుల్​ విమానం ఉదయం 10 గంటల 20 నిమిషాలకు సురక్షితంగా దిల్లీలో దిగింది.
ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​(డీజీసీఏ) సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

గతంలోనూ ఇలా

రాహుల్​ గాంధీ విమానంలో సాంకేతిక లోపం రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది సరిగ్గా ఇదే రోజు... అంటే ఏప్రిల్​ 26న దిల్లీ నుంచి కర్ణాటక హుబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఇదే అనుభవం ఎదురైంది. అయితే విమానం ఏ ప్రమాదానికి గురవకుండా జాగ్రత్తగా కిందకు దిగగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఘటనతో రాహుల్​ మానస సరోవర్​ యాత్రకు వెళ్లాలని అనుకున్నారు. అదే ఏడాది ఆ యాత్ర పూర్తిచేశారు.

Last Updated : Apr 26, 2019, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details