కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ వైదొలుగుతారన్న ఊహాగానాలకు చెక్ పెట్టారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా. "అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ రాహులే అధ్యక్షుడి"గా ఉంటారని స్పష్టం చేశారు.
త్వరలో జరగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు దిల్లీలోని సీనియర్ నేత ఏకే ఆంటోని ఇంటికి వెళ్లారు సుర్జేవాలా. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఈమేరకు సమాధానం ఇచ్చారు.