పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సొంత నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్లో ర్యాలీ నిర్వహించారు. 'రాజ్యాంగాన్ని రక్షించండి' పేరుతో రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జెండాలను చేతబూని పౌరచట్టానికి వ్యతిరేకంగా నినదించారు. వయనాడ్ కాల్పెటలోని ఎస్కేఎమ్జే ఉన్నత పాఠశాల నుంచి ర్యాలీ ప్రారంభమైంది.
'రాజ్యాంగ పరిరక్షణ' పేరిట కేరళలో రాహుల్ ర్యాలీ - Citizenship Amendment Act
పౌర చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలోని తన సొంత నియోజకవర్గం వయనాడ్లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జాతీయ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 'రాజ్యాంగాన్ని రక్షించండి' అనే నినాదంతో ర్యాలీ చేపట్టారు.
రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా కేరళలో రాహుల్ ర్యాలీ
కేరళ శాసనసభలో కాంగ్రెస్ సభాపక్ష నేత రమేష్ చెన్నితాలా, కేపీసీసీ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్, ఏఐసీసీ కార్యదర్శి కే సీ వేణుగోపాల్, పార్టీ సీనియర్ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నిరసనకారులకు 'కారం'తో సామాన్యుడి జవాబు!
Last Updated : Feb 28, 2020, 12:33 PM IST