దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయి. ఆప్తో కూటమి ఏర్పాటును రాహుల్ గాంధీ తిరస్కరించారని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దిల్లీలో కాంగ్రెస్-ఆప్ కూటమిపై గత కొద్ది రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. దేశ రాజధానిలో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగనుంది.
ఆప్తో పొత్తుకు రాహల్ సుముఖంగా లేరు: కేజ్రీ
వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుముఖంగా లేరని దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.
ఆప్తో పొత్తుకు రాహల్ సుముఖంగా లేరు: కేజ్రీవాల్
కాంగ్రెస్-ఆప్ కలిస్తే భాజపాను ఓడించడం సులభమవుతుందని ఇరు పార్టీ వర్గాలు భావించాయి. తుది నిర్ణయాన్ని రాహుల్ గాంధీ ప్రకటిస్తారని దిల్లీ కాంగ్రెస్ చీఫ్ షీలాదీక్షిత్ ఇదివరకే స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:భారత్ భేరి: 'రంగీలా' రాజకీయం ఫలించేనా?
Last Updated : Apr 1, 2019, 4:11 PM IST