తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్న వ్యాపారవేత్తలతో రాహుల్​ - కాంగ్రెస్​

అప్నీ బాత్​.. రాహుల్​కీ సాత్​ కార్యక్రమంలో భాగంగా చిన్నవ్యాపారులతో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వ్యాపారవేత్తలతో రాహుల్​ భేటీ

By

Published : Mar 4, 2019, 6:25 AM IST

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్న వ్యాపార సంస్థల యజమానులతో సమావేశమై, వారి సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు కాంగ్రెస్​ జాతీయాధ్యక్షుడు రాహుల్​ గాంధీ. ఇందుకు సంబంధించిన వీడియోనుట్విట్టర్​లో పంచుకున్నారు.

వస్తు సేవల పన్ను సహా అన్ని అంశాలపై చర్చించామని తెలిపారు. అప్నీ బాత్​, రాహుల్​ కీ సాత్​ (రాహుల్​తో మీమాట) కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. చర్చ మధ్యలోనేకాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వ్యాపారస్తులను మాట్లాడించారు రాహుల్​.

" దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్న వ్యాపారులతో ఇటీవల సమావేశమయ్యా. వారు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలుసుకున్నా. చిన్న వ్యాపారులు అభివృద్ధి చెందేందుకు, కోట్ల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించేందుకు రూపొందించాల్సిన విధానాల గురించి చర్చించాం."

-- రాహుల్​ గాంధీ ట్వీట్​

దిల్లీ, అసోం, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు యువకులతో ఇటీవలేభేటీ అయ్యారు రాహుల్​. అలాగే దిల్లీలోని ఆంధ్రాభవన్​లో వ్యాపారులతోనూసమావేశమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details