తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోర్టు నుంచి నేరుగా 'దోశ' కోసం రాహుల్..​

పరువు నష్టం కేసులో పట్నా కోర్టు నుంచి బెయిల్ పొందిన తరువాత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేరుగా రాజధానిలోని ప్రసిద్ధ బసంత్ విహార్ రెస్టారెంట్‌కు వెళ్లారు. తనకు ఇష్టమైన దోశ తిన్నారు. అల్పాహారంలో దోశ అంటే రాహుల్ గాంధీకి చాలా ఇష్టమని కాంగ్రెస్​ నేతలు బదులిచ్చారు.

కోర్టు నుంచి నేరుగా 'దోశ' కోసం రాహుల్..​

By

Published : Jul 6, 2019, 9:33 PM IST

కోర్టు నుంచి నేరుగా 'దోశ' కోసం రాహుల్..​

పరువు నష్టం కేసులో బిహార్​ రాజధాని పట్నాలోని కోర్టుకు హాజరయ్యారు కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. కోర్టులో పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో రాహుల్​ గాంధీకి ఆకలి వేసిందిట. ఆకలిగా ఉన్నట్లు తనతో ఉన్న నాయకులతో చెప్పారట. తనకు 'దోశ' అంటే ఇష్టమని రాహుల్​ చెప్పిన క్షణాల్లోనే కారు... పట్నాలోని ప్రసిద్ధ మౌర్య కాంప్లెక్స్​ లోని బసంత్​ విహార్​ రెస్టారెంట్​కి చేరుకొంది.

వెంటనే తన కాన్వాయ్​ నుంచి దిగిన రాహుల్​ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి దోశ తిన్నారు.

రాహుల్ కాన్వాయ్‌లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిత్ కుమార్ ఆయనతో కలిసి ఆరగించారు. రెస్టారెంట్​లోని ప్రసిద్ధ వంటకాలను ఆస్వాదించినట్లు తెలిపారు.

" కోర్టులో హాజరుకావాల్సి ఉండటం వల్ల రాహుల్​ గాంధీ పట్నా వచ్చారు. కోర్టు పనులన్నీ ముగించుకున్న తరువాత ఇక్కడకు వచ్చి అందరితో కలిసి భోజనం చేశారు. సాధారణంగా మధ్యాహ్నం సమయం కావున ఆకలివేసి భోజనం​ చేశారు. బిహార్​లో ఎక్కువ ప్రసిద్ధి చెందిన దోశ తిన్నారు. "

- అమిత్​ కుమార్​, కాంగ్రెస్​ ఎమ్మెల్యే

రాహుల్​ను కలిసేందుకు..

రాహుల్​ గాంధీ రెస్టారెంట్​కు వచ్చారని తెలిసి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు అక్కడకు చేరుకున్నారు. రాహుల్​ను కలిసి చేతులు కలిపేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.

ఇదీ చూడండి: కర్​నాటకం: గోవాకు పయనమైన ఎమ్మెల్యేలు

ABOUT THE AUTHOR

...view details