కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే జీఎస్టీని పునర్నిర్మిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తమిళనాడు పర్యటనలో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) ప్రతినిధులతో మాట్లాడిన రాహుల్.. జీఎస్టీ వల్ల ఆ పరిశ్రమలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగ కల్పనలో ఎంఎస్ఎంఈలను వెన్నెముఖగా అభివర్ణించిన రాహుల్.. వాటి ద్వారానే చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలతో పోటీ పడగలమన్నారు.
"ఈ జీఎస్టీ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీని వల్ల ఎంఎస్ఎంఈలపై అధిక భారం పడింది. ఆర్థిక వ్యవస్థ కూడా నాశనమైంది. వ్యాపారవేత్తలే జీఎస్టీకీ మద్దతు పలుకుతున్నారు. వారికి సాయం చేయడానికే దీనిని తీసుకొచ్చారు. ఎంఎస్ఎంఈల కోసం కాదు."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.