కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. దీనివల్ల చాలా మంది కార్మికులు విదేశాల్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
" కరోనా మహమ్మారి దృష్ట్యా పశ్చిమాసియాలో వ్యాపారాలు నిలిపివేయడం వల్ల చాలా మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ మనోవేదనకు గురవుతున్నారు. విమానాలు కూడా రద్దు చేయడం వల్ల స్వదేశానికి రాలేకపోతున్నారు. వారిని భారత్కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి."