తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ... దమ్ముంటే అవినీతిపై చర్చకు రండి' - రఫేల్​

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి సవాల్ విసిరారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. అవినీతి అంశంపై చర్చకు రావాలని ఆహ్వానించారు. పరుగెత్తగలరు కానీ.. తప్పించుకోలేరంటూ ప్రధానిని ఉద్దేశిస్తూ ట్వీట్​ చేశారు.

రాహుల్​ గాంధీ

By

Published : Apr 8, 2019, 6:49 AM IST

అవినీతి అంశంపై తనతో చర్చకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి సవాల్​ విసిరారు కాంగ్రెస్​ జాతీయాధ్యక్షుడు రాహుల్​ గాంధీ.

రఫేల్​ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పును నమ్మడం లేదా.. అంటూ ఇటీవల ఓ టీవీ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాత్రికేయురాలిని మోదీ ప్రశ్నించిన వీడియో క్లిప్​ను ట్వీట్​ చేశారు రాహుల్​ గాంధీ.

రాహుల్​ గాంధీ ట్వీట్​

" మోదీ... మీరు పరుగెత్తగలరు. కానీ తప్పించుకోలేరు. దాక్కోలేరు. మీరు చేసిన పనులే మిమ్మల్ని పట్టిస్తాయి. మీ మాటల్లోనే దేశం దాన్ని వింటోంది. నిజం చాలా శక్తిమంతమైనది. నేను మీకో సవాల్​ చేస్తున్నా... అవినీతిపై చర్చకు రండి" -- రాహుల్​ గాంధీ ట్వీట్​

జాతీయ భద్రత, అవినీతి, విదేశాంగ విధానాలపై తనతో చర్చకు రావాలని కాంగ్రెస్​ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో మోదీకి సవాల్​ విసిరారు రాహుల్​ గాంధీ. ఇప్పుడు ట్విట్టర్​ వేదికగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు.

అనిల్​ అంబానీకి రూ.30వేల కోట్లు దక్కేలా ప్రధాని మోదీ రఫేల్​ ఒప్పందంలో అవకతవకలకు పాల్పడ్డారని చాలా కాలంగా ఆరోపిస్తోంది కాంగ్రెస్​ పార్టీ.

ఇవీ చూడండి : 'చౌకీదార్ నాటకాలను ప్రజలు నమ్మరు'

జమ్ము-శ్రీనగర్ హైవేపై రాజకీయ రగడ

ABOUT THE AUTHOR

...view details