పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ సూరత్ కోర్టు ఊరటనిచ్చింది. కేసు విషయంలో న్యాయస్థానానికి వ్యక్తిగత హాజరు అవసరం లేదని స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల రాహుల్ ఇవాళ హాజరు కాలేరన్న అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించి విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేసింది.
పరువు నష్టం కేసులో రాహుల్కు ఊరట - ఎన్నికల ప్రచారం
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టు ఊరటనిచ్చింది. మోదీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి విముక్తి కల్పించింది న్యాయస్థానం.
రాహుల్ గాంధీ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా "‘దొంగలందరికీ ఇంటిపేరు మోదీనే ఎందుకు ఉంటుంది?" అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. రాహుల్పై పరువు నష్టం కేసు వేశారు. పరిశీలనకు స్వీకరించిన సూరత్ కోర్టు.. న్యాయస్థానానికి రాహుల్ హాజరు కావాలని గతంలో నోటీసులు పంపింది.
ఇదీ చూడండి: సుప్రీంలో 'కర్ణాటకీయం' రేపటికి వాయిదా!
Last Updated : Jul 17, 2019, 12:24 AM IST