తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో రాహుల్...కొద్ది రోజులు అక్కడే!

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలో పర్యటిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నియోజకవర్గంలో పర్యటిస్తూ సహాయక చర్యలపై సమీక్షిస్తున్నారు రాహుల్.

వయనాడ్​లో రాహుల్

By

Published : Aug 11, 2019, 5:21 PM IST

Updated : Sep 26, 2019, 4:10 PM IST

వయనాడ్​లో రాహుల్-వరద సహాయమే లక్ష్యం

కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో వయనాడ్​ లోక్​సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళకు చేరుకున్నారు. సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రాహుల్ వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉన్నారు.

వయనాడ్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పునారావాస కేంద్రాలను ఈ పర్యటనలో రాహుల్ సందర్శిస్తారని తెలుస్తోంది.

రాహల్ గాంధీ ట్వీట్

"కొద్ది రోజులు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్​సభ నియోజకవర్గంలోనే ఉండనున్నాను. వరదల కారణంగా వయనాడ్ ధ్వంసమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తాను.​"

-ట్విట్టర్​లో రాహుల్ గాంధీ

వయనాడ్​లో వరదముంపుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి పినరయి విజయన్, వయనాడ్ జిల్లా పాలనాధికారితో సంభాషించినట్లు రాహుల్ వెల్లడించారు.

రెండో పర్యటన

ఎన్నికల్లో గెలిచిన అనంతరం వయనాడ్​లో రెండోసారి పర్యటిస్తున్నారు రాహుల్. ఇంతకుముందు తనను గెలిపించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా మూడు రోజులపాటు వయనాడ్​లో పర్యటించారు.

ఇదీ చూడండి: కశ్మీర్​పై మసూద్​ ఆడియో టేప్​ కలకలం

Last Updated : Sep 26, 2019, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details