తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"అధికారంలోకి రాగానే నీతి ఆయోగ్​ రద్దు​" - రద్దు

కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే నీతి ఆయోగ్​ను రద్దు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ప్రకటించారు. నీతి ఆయోగ్​ మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

నీతి ఆయోగ్

By

Published : Mar 30, 2019, 6:43 AM IST

Updated : Mar 30, 2019, 7:01 AM IST

అధికారంలోకి రాగానే నీతి ఆయోగ్​ రద్దు
తమ పార్టీ అధికారంలోకి వస్తే 'నీతి ఆయోగ్​'ను రద్దు చేసి ఆ స్థానాన్ని 'పటిష్ట ప్రణాళికా సంఘంతో' భర్తీ చేస్తామని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు రాహుల్.​

ప్రధాని ఆర్భాటంగా ప్రారంభించిన 'నీతి ఆయోగ్'​ కేవలం ప్రసంగాలకు, తప్పుడు నివేదికల విడుదలకే పనికొచ్చిందని రాహుల్​ ఆరోపించారు. దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు.

రాహుల్​ గాంధీ ట్విట్​

కొత్తగా ఏర్పాటు చేసే ప్రణాళికా సంఘంలో ప్రఖ్యాత ఆర్థిక వేత్తలను నియమిస్తామని రాహుల్​ తెలిపారు. మొత్తం సిబ్బంది 100 లోపు ఉంటారని స్పష్టం చేశారు.

1950లో కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఆ స్థానంలో నీతి ఆయోగ్​ను ఏర్పాటు చేసింది.

Last Updated : Mar 30, 2019, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details