రాజీవ్ గాంధీపై ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. 'మీ స్థితిని మా తండ్రికి ఆపాదించినంత మాత్రాన తప్పించుకోలేరు' అని మోదీని హెచ్చరించారు. ప్రేమతో మీ రాహుల్ అంటూ ట్వీట్ చేశారు.
"మోదీజీ... యుద్ధం ముగిసింది. మీ కర్మ మీకోసం ఎదురుచూస్తుంటుంది. మీరున్న స్థితిని మా తండ్రికి ఆపాదించినా మీరు తప్పించుకోలేరు. ప్రేమతో మీ రాహుల్."
-కాంగ్రెస్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ ట్వీట్.