భారత్-చైనా సరిహద్దుల్లో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. రఫేల్ యుద్ధ విమానాలు లద్ధాఖ్‌లోని చైనా సరిహద్దుల వెంట చక్కర్లు కొట్టాయి. భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రఫెల్ యుద్ధ విమానాలు.. వాస్తవాధీన రేఖ వెంట ఎగురుతున్న వీడియోను ఒకదాన్ని రక్షణ వర్గాలు విడుదల చేశాయి. లద్ధాఖ్‌లోని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా చేసేందుకు ఇలా రఫేల్ ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం.
భారత్-చైనా సరిహద్దులో రఫేల్ చక్కర్లు - లద్దాఖ్‌లో రఫేల్ ప్రయోగాలు
భారత అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా భావిస్తోన్న రఫేల్ యుద్ధ విమానాలు లద్దాఖ్‌లో చక్కర్లు కొట్టాయి. చైనా వాస్తవాధీన రేఖ వెంట ఎగురుతున్న ఈ విమానం వీడియోను విడుదల చేసింది రక్షణ శాఖ.
భారత్-చైనా సరిహద్దులో రఫేల్ చక్కర్లు