'ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి.... దానితోపాటు వ్యాపారం వృద్ధి చెందాలి'.... ఇదీ కోల్‌కతాలో ఓ మిఠాయి దుకాణదారుడికి వచ్చిన ఆలోచన. రెండింటినీ కలిపి ఆయన చేసిన ప్రయత్నం ఔరా అనిపిస్తోంది.
రాజకీయ మిఠాయిలతో చైతన్యం, సిరి - కోల్‌కతా
ఓటు హక్కుపై అవగాహన కల్పించటంలో ఎవరి తీరు వారిది. అందరికంటే భిన్నంగా ఎలా చేయొచ్చు? అనే ఆలోచన వచ్చింది కోల్‌కతాలోని మిఠాయి దుకాణదారుడికి. ఆయన చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది.
ప్రధాన పార్టీల గుర్తులు ఉండే విధంగా మిఠాయిలు తయారు చేశారు ప్రదీప్ హల్దార్. వీటికి 'ఎన్నికల మిఠాయి'లుగా నామకరణం చేశారు. బంగాల్ అనగానే గుర్తొచ్చే రసగుల్లాలను వివిధ పార్టీల రంగుల్లో తయారు చేశారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని మేము గమనించాం. బంగాల్‌లో రసగుల్లా, మిఠాయికి మంచి పేరుంది. మిఠాయిలను ఉపయోగించి ఓటుపై అవగాహన కల్పించాలనుకున్నాం. దీనితో మా విక్రయాలు పెరుగుతాయి. వ్యాపారమూ బాగుంటుంది. ఇది కొత్త పద్ధతి కూడా. వీటన్నింటనీ పరిగణనలోకి తీసుకొని భాజపా కమలం, కాంగ్రెస్ హస్తం, సీపీఎం కొడవలి, తృణమూల్ కాంగ్రెస్ పూల గుర్తులతో స్వీట్లు తయారు చేశాం. రసగుల్లా కూడా తయారు చేశాం. తృణమూల్, భాజపా, సీపీఎం, కాంగ్రెస్ రసగుల్లాలు చేశాం.
- ప్రదీప్ హల్దార్, మిఠాయి దుకాణదారుడు