తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రబ్బరు ట్యూబులతో శవాన్ని నది దాటించేశారు!

మృతదేహాన్ని మంచానికి కట్టి.. రబ్బరు ట్యూబుల సాయంతో నదిని దాటించారు రాజస్థాన్​ వాసులు. రామ్​గంజ్​ మండీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తమ గ్రామానికి వంతెన లేకపోవడం వల్ల  మంగీలాల్​ అనే వ్యక్తి శవాన్ని స్వగృహానికి చేర్చేందుకు ఈ సాహసం చేశారు ఆయన బంధువులు.

By

Published : Sep 15, 2019, 8:44 PM IST

Updated : Sep 30, 2019, 6:17 PM IST

రబ్బరు ట్యాబు సాయంతో మృతదేహాన్ని నది దాటించారు

రబ్బరు ట్యూబులతో శవాన్ని నది దాటించేశారు!

రాజస్థాన్​లోని రామ్​గంజ్​ మండీ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. మదన్​పురా పంచాయతీలోని సారన్​ఖేడీ వాసులు ప్రాణాలను పణంగా పెట్టి శవాన్ని నది దాటించారు. మృతదేహాన్ని మంచానికి కట్టి రబ్బరు ట్యూబుల సాయంతో ఎట్టకేలకు ఒడ్డున పడ్డారు.

సారన్​ఖేడీకి చెందిన మంగీలాల్ అనే వ్యక్తి అనారోగ్యంతో సమీప నగరంలోని ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ హాస్పిటల్​ లోనే మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని గ్రామానికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఉన్న తాక్లీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పైగా వంతెన కూడా లేదు. ఎటూ దిక్కుతోచని మంగీలాల్​ బంధువులు చివరకు శవాన్ని మంచానికి కట్టేసి రబ్బరు ట్యూబుల సాయంతో నదిని దాటించారు.

తాక్లీ నది ఉద్ధృతంగా ప్రవహించినపుడల్లా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు తెలిపారు. నదిపై ఆనకట్ట విషయమై అధికారులకు అనేక వినతులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.

ఇదీ చూడండి: ఇంట్లో చొరబడి శునకాన్ని ఎత్తుకెళ్లిన చిరుత!

Last Updated : Sep 30, 2019, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details