తెలంగాణ

telangana

ఆ ఆస్పత్రిలోని కరోనా రోగులకు కొత్త ఔషధం!

By

Published : May 22, 2020, 3:30 PM IST

కరోనా రోగులపై ప్రభావవంతంగా పనిచేస్తోన్న కొత్త ఔషధం టోసిలిజుమాబ్​ను వినియోగించేందుకు పుణె ఆస్పత్రి సిద్ధమవుతోంది. ఇందుకోసం ఓ టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసింది. త్వరలోనే తొలిదశలో 25 మంది రోగులకు ఈ ఔషధం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

new drug for COVID-19 treatment
పుణె ఆస్పత్రిలోని కరోనా రోగులకు కొత్త ఔషధం!

కరోనా రోగులకు ఉపశమనం కల్పిస్తోన్న కొత్త ఔషధాన్ని వినియోగించేందుకు పుణెలోని ససూన్​ జనరల్​ ప్రభుత్వ ఆస్పత్రి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న కనీసం 25 మంది రోగులకు ‘టోసిలిజుమాబ్​ ఔషధాన్ని త్వరలోనే ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

" ఈ కొత్త ఔషధం విలువ సుమారు రూ. 20వేల వరకు ఉంటుంది. తొలి దశలో 25 మంది రోగులకు ఇవ్వనున్నాం. ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలపై పుణె మున్సిపల్​ కార్పొరేషన్​ నిర్ణయం తీసుకుంటుంది. కొవిడ్​-19 రోగులు తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో టొసిలిజుమాబ్​ ఇచ్చేందుకు డా. డీబీ కదమ్​ నేతృత్వంలో ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. కరోనా సోకిన రోగుల్లో 50 ఏళ్లలోపు వారిలో సైటోకైన్​ స్టోర్మ్​ లక్షణాలతో పాటు, జ్వరం, ఆక్సిజన్​ అవసరమైన వారికి ఈ మందును టాస్క్​ఫోర్స్​ సిఫార్సు​ చేస్తుంది. "

- శేఖర్​ గైక్వాడ్​, పుణె పురపాలక కమిషనర్​

భారతీ ఆస్పత్రిలో కరోనా ప్రభావంతో తీవ్ర అనారోగ్యానికి గురైన అంగన్​వాడీ కార్యకర్తకు టొలిసిజుమాబ్​ అందించినట్లు తెలిపారు గైక్వాడ్​. ఆమె అనుహ్య రీతిలో కోలుకుందన్నారు. ముంబయిలోని సివిల్​ ఆస్పత్రిలో కూడా ఈ మందును వినియోగించగా.. మంచి ఫలితాలు వచ్చినట్లు తెలిపారు.

దేశంలోనే మహారాష్ట్ర కరోనా కేసుల్లో తొలిస్థానంలో ఉంది. అందులో పుణె జిల్లా ముంబయి తర్వాత రెండోస్థానంలో ఉంది. ఇప్పటి వరకు 4,809 కేసులు నమోదు కాగా 242 మంది ప్రాణాలు కోల్పోయారు.

ABOUT THE AUTHOR

...view details