తెలంగాణ

telangana

ETV Bharat / bharat

7.5 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం.. ఐదుగురి అరెస్ట్​

Pune- Anti Extortion Cell of Pune police and Investigation Cell of Indian Army arrested 5 persons
నకిలీ కరెన్సీ కేసులో ఆర్మీ అధికారి అరెస్టు.. 7.5 కోట్లు స్వాధీనం

By

Published : Jun 10, 2020, 7:47 PM IST

Updated : Jun 10, 2020, 8:51 PM IST

20:13 June 10

7.5 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం.. ఐదుగురి అరెస్ట్​

పూణె ఎరవాడా సంజయ్​ పార్క్​ వద్ద 7.5 కోట్లు విలువ చేసే నకిలీ కరెన్సీని బుధవారం పథకం ప్రకారం పట్టుకున్నారు పోలీసులు. ఈ ఘటనలో ఆర్మీ అధికారితో సహా మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు.  

పుణె పోలీసుల యాంటీ ఎక్స్‌ట్రాక్షన్ సెల్, ఇండియన్ ఆర్మీకి చెందిన ఇన్వెస్టిగేషన్ సెల్ అధికారులు సంయుక్తంగా నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి 7 కోట్లు 60 లక్షల నకిలీ నగదు, అలాగే 2 లక్షల 80 వేల భారత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.  

నకిలీ కరెన్సీ చలామణి అవుతుందన్న పక్కా సమాచారంతో బుధవారం మధ్యాహ్నం దాడి చేశాం. ఆర్మీ అధికారితో సహా మొత్తం ఐదుగురిని అరెస్టు చేశాం. కొంత మంది వ్యక్తులతో కలిసి ఈ ఆర్మీ అధికారి  నకిలీ నగదును డాలర్లుగా మారుస్తున్నట్లు గుర్తించాం

-ఓ సీనియర్​ అధికారి.

19:37 June 10

నకిలీ కరెన్సీ కేసులో ఆర్మీ అధికారి సహా ఐదుగురి అరెస్ట్​

పుణె పోలీసుల యాంటీ ఎక్స్‌ట్రాక్షన్ సెల్, ఇండియన్ ఆర్మీకి చెందిన ఇన్వెస్టిగేషన్ సెల్ అధికారులు రూ.7.6 కోట్ల నకిలీ కరెన్సీ కేసులో ఐదుగురిని అరెస్ట్​ చేశారు. అందులో ఆర్మీ అధికారి కూడా ఉన్నారు.

Last Updated : Jun 10, 2020, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details