తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రతిపక్షాల నిరసనలతో దద్దరిల్లిన కర్ణాటక అసెంబ్లీ - bjp

అధికార సంకీర్ణ ప్రభుత్వానికి మెజారిటీ లేదంటూ భాజపా సభ్యులు కర్ణాటక అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

భాజపా సభ్యుల ఆందోళన

By

Published : Feb 6, 2019, 2:33 PM IST

భాజపా సభ్యుల ఆందోళన
కర్ణాటక అసెంబ్లీ సంయుక్త సమావేశం ప్రతిపక్షాల నిరసనలతో దద్దరిల్లుతోంది. జేడీ(ఎస్​)-కాంగ్రెస్​ ప్రభుత్వానికి సభలో మెజారిటీ లేదంటూ భాజపా నేతలు గవర్నర్​ వాజూభాయ్​ వాలా ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

డిసెంబర్​లో మంత్రివర్గ విస్తరణ తరువాత మొదటిసారిగా ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అధికార జేడీ(ఎస్​)-కాంగ్రెస్​ కూటమిలోని అసంతృప్త శాసనసభ్యులను తమవైపు తిప్పుకుని అధికారం కైవసం చేసుకోవాలని భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

బడ్జెట్​ సమావేశాల తొలిరోజే సభలో గందరగోళం రేగింది. శాసనసభ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ వాజూభాయ్​వాలా చేస్తున్న ప్రసంగాన్ని భాజపా సభ్యులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి తగినంత మెజారిటీ లేనందున గవర్నర్ తన ప్రసంగాన్ని ఆపాలని పోడియంలోకి వచ్చి ఆందోళనకు దిగారు. దీంతో గవర్నర్ తన ప్రసంగాన్ని మధ్యలో ముగిస్తున్నట్లు ప్రకటించారు.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆర్థిక మంత్రిత్వ బాధ్యతలనూ నిర్వహిస్తున్నారు. కుమారస్వామి రెండవసారి సంకీర్ణ ప్రభుత్వం తరపున రాష్ట్ర బడ్జెట్​ను ఫిబ్రవరి 8న ప్రవేశపెట్టనున్నారు.

ABOUT THE AUTHOR

...view details