పాకిస్థాన్ దాడులతో కశ్మీర్లో ఏర్పడ్డ ఉద్రిక్తతలు క్రమంగా సద్దుమణుగుతున్నాయి. మార్కెట్లు, దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ప్రజారవాణా ప్రారంభమవుతోంది.
1-2 రోజుల నుంచి పరిస్థితులు బాగున్నాయి. మూసివేసిన మార్కెట్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. కాల్పుల వల్ల కొన్ని రోజుల క్రితం విద్యార్థుల పరీక్షలు వాయిదా పడ్డాయి. కొన్ని రోజుల్లో వాటిని కూడా నిర్వహిస్తారు. 1-2 రోజుల్లో మార్కెట్లన్నీ తెరుచుకుంటాయి. పరిస్థితులు సాధారణానికి వస్తాయి. - మహమ్మదిన్ ఇంప్యాజ్, మాంజాకోట్ వాసి
ఆగిన దాడులు...
శనివారం రాత్రి నుంచి జమ్ముకశ్మీర్‌లోని ఫూంచ్, రాజౌరీ జిల్లాల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన ఘటనలు నమోదవలేదని రక్షణ అధికారులు తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొవటానికి సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు.