తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్యాన నిరసనల హోరు

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా త్రిపురలో నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రం తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలంటూ ఆందోళనకారులు తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు.

Protest being held in Tripura Agartala against CitizenshipAmendmentBill2019
పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్యాన నిరసనల హోరు

By

Published : Dec 9, 2019, 12:08 PM IST

పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్యాన నిరసనల హోరు

వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం లోక్​సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ త్రిపుర రాజధాని అగర్తలలో ఆందోళనలు చెలరేగాయి. తమ ఉనికికే ఇబ్బందిగా పరిణమించే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని నిరసనకారులు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

బిల్లులో ఏముంది?

పాకిస్థాన్​, బంగ్లాదేశ్​, ఆఫ్గానిస్థాన్​ నుంచి వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు సహా వివిధ వర్గాలకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించినదే పౌరసత్వ సవరణ బిల్లు - 2019. అయితే ఈ బిల్లును కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా పలుపార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

ఇదీ చూడండి: ముఖంపై 20 కొడవలి పోట్లు, 200 కుట్లు- మహిళ మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details