కర్ణాటక హుబ్బళ్లిలో దారుణం జరిగింది. ఆస్తిపై మమకారంతో తమ్ముడిని నరికి చంపారు ఇద్దరు కర్కశులు.
హుబ్బళ్లిలోని కమలాపుర్కు చెందిన ఉమేశ్ బలగీకి... అతడి పెదనాన్న కొడుకులు చెన్నప్ప, బాసప్పకు మధ్య చాలా రోజులుగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. దీంతో స్కూటర్‌పై బయల్దేరిన తమ్ముడు ఉమేశ్‌పై కత్తులతో దాడికి పాల్పడ్డారు అన్నయ్యలు చెన్నప్ప, బాసప్ప. ఈ దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఉమేశ్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.