జాతీయ పోషకాహార పథకం(ఎన్ఎన్ఎమ్) ద్వారా అంగన్వాడి కేంద్రాల కోసం స్మార్ట్ఫోన్లు, పెరుగుదలను కొలిచే పరికరాలను సమకూర్చడంలో రాష్ట్రాలు మరింత చొరవ చూపాలని నీతి ఆయోగ్ సూచించింది. ప్రస్తుతం అవసరమైనంత స్థాయిలో కొనుగోళ్లు జరగడంలేదని అసంతృప్తి వ్యక్తంచేసింది.
దేశంలోని అంగన్వాడి కేంద్రాల్లో ప్రస్తుతం 6.28 లక్షల చరవాణిలు, 6.37 లక్షల వృద్ధి పర్యవేక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఐదు రాష్ట్రాల్లోని అంగన్వాడి కేంద్రాల్లో ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో లేవని, మరో 14 రాష్ట్రాల్లో అవసరమైన పరికరాలు కూడా సమకూర్చలేదని గత నెల జరిగిన సమావేశంలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
"సదుపాయాల కల్పన ఆలస్యమైతే అంగన్వాడి కేంద్రాలు మనకు కావలసిన ఫలితాలను అందించలేకపోవచ్చు. తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న పిల్లలను కూడా వారు గుర్తించలేకపోవచ్చు."
-రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్